Trailer: ఆసక్తిని పెంచిన 'ఏఆర్‌ఎమ్‌' ట్రైలర్‌.. అసలు కథెంటంటే..

Trailer: ఆసక్తిని పెంచిన ఏఆర్‌ఎమ్‌ ట్రైలర్‌.. అసలు కథెంటంటే..
x

Trailer: ఆసక్తిని పెంచిన 'ఏఆర్‌ఎమ్‌' ట్రైలర్‌.. అసలు కథెంటంటే.. 

Highlights

మలయాళ నటుడు టోవినో థామస్ జితిన్‌ లాల్‌ నటించిన తాజా చిత్రం 'ఏఆర్‌ఎమ్‌'. జితిన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే...

మలయాళ నటుడు టోవినో థామస్ జితిన్‌ లాల్‌ నటించిన తాజా చిత్రం 'ఏఆర్‌ఎమ్‌'. జితిన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమానను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా టీజర్‌ను టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఆయా భాషల్లో విడుదల చేశారు. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా తాజాగా సినిమా యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదుల చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తుండడం కూడా ఈ సిమిమాకు మంచి బజ్‌ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

2.45 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ను గమనిస్తే హరిపురం అనే గ్రామం చుట్టూ సినిమా కథ ఉండనుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని 3డీలో విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్లుగా యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. విజువల్‌ వండర్‌గా సినిమా రానున్నట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మూడు యుగాల కథాంవంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పీరియాడికల్ ఫాంటసీ చిత్రంలో హీరో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల జరుపుకుంతోంది. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, ప్రమోద్ శెట్టి, నిస్తార్ సైత్, రోహిణి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా కృతిశెట్టి మలయాళంలో ఎంట్రీ ఇవ్వనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories