ARM: 'ఏఆర్‌ఎమ్‌' మూవీ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న లిరిక్స్‌

Tovino Thomas Latest Movie ARM First Song Chilake Released
x

ARM: 'ఏఆర్‌ఎమ్‌' మూవీ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న లిరిక్స్‌

Highlights

ARM: మలయాళ నటుడు టోవినో థామస్ తన తదుపరి చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలోచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

ARM: మలయాళ నటుడు టోవినో థామస్ తన తదుపరి చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలోచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సిమిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

ఇక సినిమా తేదీ దగ్గరపడుతోన్న క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది. 'చిలకే.. పువ్వే పువ్వే తామర పువ్వే' అంటూ సాగే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిబు నైనన్ థామస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కపిల్ కపిలన్ ఈ సాంగ్ పాడగా, కృష్ణ కాంత్ అద్భుతమైన లిరిక్స్‌ అందించారు. ఇక సాంగ్ విషయానికొస్తే.. టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పాట విడుదలైన కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభించింది. టొవినో థామస్ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందని సినిమా ప్రేక్షకులు అంటున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories