Highest Pre Release Business In Tollywood: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు..

Highest Pre Release Business In Tollywood
x

Highest Pre Release Business In Tollywood: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు..

Highlights

Tollywood Highest Pre Release Business Movies: గత కొద్ది కాలంగా ఇండియాలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. బాహుబలితో మొదలైన మేనియా బాహుబాలి2, ఆర్ఆర్ఆర్, కల్కి వంటి సినిమాలతో మరో లెవల్ కు చేరుకుంది.

Tollywood Highest Pre Release Business Movies: గత కొద్ది కాలంగా ఇండియాలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. బాహుబలితో మొదలైన మేనియా బాహుబాలి2, ఆర్ఆర్ఆర్, కల్కి వంటి సినిమాలతో మరో లెవల్ కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటేనే ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తోంది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ నంబర్స్ నమోదౌతున్నాయి.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప2 మూవీతో పలకరించబోతున్నారు. ఈ సినిమా తెలుగు సహా మనదేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. పుష్ప2తో పాటు ఏఏ సినిమాలు ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయో చూద్దాం.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప2 ది రూల్. పుష్ప పార్ట్ 1కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదే రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులోనూ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగులోనే రూ.213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రపపంచ వ్యాప్తంగా రూ.617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి చరిత్ర సృష్టించింది.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహబలి2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ చేయడం విశేషం

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.191కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్. తెలుగు రాష్ట్రాల్లో రూ.145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాహో. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories