కారణం లేకుండా నన్ను టార్గెట్‌ చేశారు...సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్!

కారణం లేకుండా నన్ను టార్గెట్‌ చేశారు...సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్!
x
Sunitha (File Photo)
Highlights

సింగర్ సునీత ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు..

సింగర్ సునీత ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు..సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఇది ఇలా ఉంటే సునీత తన ఫేస్ బుక్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

" కారణం లేకుండా అతి సులభంగా నన్ను టార్గెట్‌ చేసిన వారిని చూశా ... జూనియర్‌ సింగర్స్‌ నన్ను దారుణంగా ఇమిటేట్‌ చేయడం చూశా.. ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం నేను చూశాను ... నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు సృష్టించబడటం నేను చూశాను .... వెబ్‌సైట్లు నా గురించి అర్ధంలేనివి రాయడం నేను చూశాను ... వారి స్వంత అభద్రతల కారణంగా ప్రజలు నన్ను అకస్మాత్తుగా విడిచిపెట్టడాన్ని నేను చూశాను .... నా వ్యక్తిగత జీవితం గురించి మహిళలు హానికరమైన పుకార్లు వ్యాప్తి చేయడాన్ని నేను చూశాను ... విజయాలు, అపజయాలు చూశాను, మౌనంగా ఉంటూ జీవితానికి సరిపడా చేసేశా. పిల్లలను ఆధిపత్యంగా పెంచడం ఎంత కష్టమో నేను చూశాను, అదే సమయంలో పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొంటూ ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు' .. మొత్తానికి, నేను జీవితాన్ని చూశాను .. ఇవన్నీ నా జీవితాన్ని మరింత అర్ధవంతం చేస్తాయి ... " అని సునీత పేర్కొన్నారు.

ఇక ఆదివారం సునీత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను సునీత షేర్‌‌ చేశారు. 'ఇవాళ నన్నెంతో అభిమానించే వారు నా కోసం ఒక్కటయ్యారు. నా పని తీరును గుర్తు చేసి, అభినందించారు. నా ఉనికికి కారణం తెలిపారు. వీరంతా కలిసి నా జీవితానికి మరింత అర్థం తెచ్చారు. మీకంతా నా ధన్యవాదాలు' అని సునీత పేర్కొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories