డబ్బు విషయంలో స్ట్రిక్ట్‌గానే ఉంటాను.. అందుకే 23పెళ్ళిళ్ళు చేయగలిగాను!

డబ్బు విషయంలో స్ట్రిక్ట్‌గానే ఉంటాను.. అందుకే 23పెళ్ళిళ్ళు చేయగలిగాను!
x
Brahmanandam (File Photo)
Highlights

తనదైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ టాలీవుడ్ లో హాస్యబ్రహ్మాగా పేరుపొందారు బ్రహ్మానందం..

తనదైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ టాలీవుడ్ లో హాస్యబ్రహ్మాగా పేరుపొందారు బ్రహ్మానందం.. మూడున్నర దశాబ్దాలకి పైగా సినిమాల్లో నటించి చాలా మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు బ్రహ్మానందం. అయితే రెమ్యునరేషన్ విషయంలో బ్రహ్మానందం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారని రూమర్స్ ఉన్నాయి. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం వీటిపైన క్లారిటీ ఇచ్చారు.

తానూ డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా అంటే.. చిత్రపరిశ్రమలో నేను చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కానీ ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని అన్నారు. డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు.. ఒకవేళ డబ్బు విషయంలో నేను గట్టిగా లేనని అనుకుంటే రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏంటి? దీన్ని నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటానని చెప్పుకొచ్చారు.

అలా డబ్బుకు రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టే 23 మంది ఆడపిల్లలకు నా చేతులతో పెళ్లి చేయించగలిగానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. నేను ఆ ఆడపిల్లలకు పెళ్లి చేయకపోతేవాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదని బ్రహ్మానందం వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories