Natti Kumar : థియేటర్లు తెరవకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుంది : నట్టి కుమార్

Natti Kumar :  థియేటర్లు తెరవకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుంది  : నట్టి కుమార్
x

natti kumar

Highlights

Natti Kumar : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో

Natti Kumar : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో అన్ని ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి.. అందులో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్ లు మూతపడడంతో ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం చూసింది.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ.. షూటింగ్ లకు అనుమతిని ఇచ్చింది.. కానీ ఇంకా ధియేటర్ల రీ ఓపెన్ పైన స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఇదే ఈ ఇష్యూపై సినీ నిర్మాత, ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ జాయింట్ సెక్ర‌ట‌రీ నట్టికుమార్ స్పందిస్తూ తన అసంతృతిని వ్యక్తం చేశారు. కరోనా పేరుతో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమం వస్తుందని అన్నారు. అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చారు కానీ ధియేటర్ లకి ఇస్తే వచ్చే ప్రమాదం ఏంటో చెప్పాలని అన్నారు..

థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల సినిమా హాల్స్ దెబ్బతింటున్నాయని, కొన్ని థియేటర్స్‌లో ఫర్నీచర్ నాశనం అవుతుందని, మరికొన్ని థియేటర్స్‌ లలో ఫర్నీచర్ చోరీకి గురైన సంఘటనలు కూడా చోటు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. ఇక ధియేటర్లు మూత పడడం వలన చాలా మంది కార్మికులు రోడ్డు మీదా పడ్డారని, చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు..

ప్రస్తుతం ధియేటర్ లు మూతపడడంతో కొన్ని సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఓటీటీ వేదికగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఎందుకంటే వారి సినిమాలు కచ్చితంగా ధియేటర్ లలోనే రిలీజ్ చేయాలని, వారికి ఇలాంటి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన ఘనత కూడా థియేటర్లకే దక్కుతుందని అన్నారు. దీనిపట్ల టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories