Bandla Ganesh Praises Etela Rajender: మంత్రి ఈటెల పై బండ్ల ప్రశంశలు!

Bandla Ganesh Praises Etela Rajender: మంత్రి ఈటెల పై బండ్ల ప్రశంశలు!
x
Bandla Ganesh (File Photo)
Highlights

Bandla Ganesh Praises Etela Rajender: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ప్రశంశలు కురిపించారు తాజాగా బండ్ల గణేష్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Bandla Ganesh Praises Etela Rajender: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ప్రశంశలు కురిపించారు తాజాగా బండ్ల గణేష్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనాని జయించారు. తానూ కోలుకోవడానికి ఎంతో కృషి చేసిన వైద్యులకి బండ్ల ధన్యవాదాలు తెలిపాడు గణేష్... ఇక తాజాగా తనకు కరోనా పాజిటివ్‌ అని తెలిసినప్పుడు మంత్రి ఈటెల రాజేందర్‌ గారు నన్ను ఆస్పత్రిలో చేర్పించారని, ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తున్న ఆరోగ్యమంత్రికి నా ధన్యవాదాలు. నా ప్రాణం కాపాడిన దేవుడు ఈటల రాజేందర్‌ గారు అంటూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు బండ్ల..

అంతేకాకుండా.. మరో కోవిడ్‌ భాధితుడి స్టేట్‌మెంట్‌ను కూడా గణేష్‌ షేర్‌ చేశాడు.. 'నా పేరు రఫీ నాకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో కొన్ని హాస్పిటల్స్‌కి వెళ్లాను. వాళ్లు చేర్చుకోమని చెప్పడంతో ఇంటర్నెట్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ నంబర్‌ చూసి ఫోన్‌ చేశాను. రాత్రి 12 గంటల సమయంలోనూ సార్‌ ఫోన్‌ మాట్లాడి వాళ్ల పీఎకు నా వివరాలు అందించారు' అని అందులో పొందు పరిచాడు..తెలంగాణ సీఎంవో, హెల్త్‌మినిష్టర్‌ను ట్యాగ్‌ చేశాడు గణేష్!

తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు గణేష్.



Show Full Article
Print Article
Next Story
More Stories