టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా
x
Highlights

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా కొనసాగుతుంది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి వరుస విజయాలు అందిస్తున్న డెబ్యూ...

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా కొనసాగుతుంది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి వరుస విజయాలు అందిస్తున్న డెబ్యూ డైరెక్టర్ లపై ఓ స్పెషల్ స్టోరి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త దర్శకుల రాకతో కొత్త కళ వచ్చిందని చెప్పాలి. డెబ్యూ డైరెక్టర్లు రిలీజ్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ సాధించడంతో ఇండస్ట్రీ అంతా వీరి గురించే చర్చించుకుంటుంది. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఫాంటసీ రోమాంటిక్ సినిమాతో మున్నా దర్శకుడిగా పరిచయమయ్యారు. యాంకర్ ప్రదీప్, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా మినిమం బడ్జెట్ తో రూపోందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ ను సోంతం చేసుకుంది. అదీ ధియేటర్ లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషం.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిశ్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెనతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ ను సోంతం చేసుకున్నాడు. రిలీజైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల గ్రాస్ సాధించిందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఏ స్థాయి సక్సెస్ సాధించిందో. మొదటి సినిమాతోనే గురువుకు తగ్గ శిశ్యుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు కు స్టార్ హీరోల నుంచి ఆఫ్లర్లు వస్తున్నాయి.

దాదాపు 8 ఏళ్ల నుంచి వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమౌవుతున్న అల్లరి నరేష్ కి కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల నాంది సినిమాతో మంచి సక్సెస్ నిచ్చాడు. అల్లరి నరేష్ అంటేనే కామెడీకి బ్రాండ్. అటువంటిది క్రైమ్, కోర్ట్ రూమ్ డ్రామాతో సినిమా తీసి హిట్ కొట్టి అల్లరి నరేష్ అన్ని క్యారక్టర్లు చేయగలడని ప్రూవ్ చేశాడు.

ఇక సుమంత్ హీరోగా ప్రదీప్ క్రిష్ణమూరి తెరకెక్కించిన కపటధారి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు ప్రదీప్ క్రిష్ణమూరి డెబ్యూ డైరెక్టర్ కాకపోయినా తెలుగులో మాత్రం ఇది డెబ్యూ సినిమానే కన్నడ కవలుదారి చిత్రానికి ఈ సినిమా రీమేక్.

ఇలా కొత్త దర్శకుల రాకతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళ లాడుతోంది. లౌక్ డౌన్ అనంతరం రిలీజైన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటడంతో దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సక్సెస్ రేటు తక్కువ ఉన్న సినీ ఇండస్ట్రీకి ఈ రకంగానైన మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories