కరోనా నుంచి కోలుకుంటున్న రాజశేఖర్‌!

కరోనా నుంచి కోలుకుంటున్న రాజశేఖర్‌!
x
Highlights

కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతోన్న హీరో రాజశేఖర్‌ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రాజశేఖర్‌కు వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం సాధారణ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతోన్న హీరో రాజశేఖర్‌ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రాజశేఖర్‌కు వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం సాధారణ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వెంటిలేటర్‌ లేకుండా అందిస్తోన్న వైద్యానికి రాజశేఖర్ శరీరం బాగానే స్పందిస్తోందని, క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన హీరో రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. తాజాగా ఆయనకి ప్లాస్మా థెరపీ కూడా చేశాం.గతంతో పోలిస్తే, రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి కాస్తా మెరుగుపడింది. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు అని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు వెల్లడించారు. అటు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు. తాజాగా జీవిత కరోనా నుంచి కోలుకోగా ఆమె డిశ్చార్జ్ అయ్యారు!

Show Full Article
Print Article
Next Story
More Stories