Allu Arjun Appreciates Palasa Movie : ఈ ఏడాది అరభంలో వచ్చిన ‘పలాస 1978’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు
Allu Arjun Appreciates Palasa Movie : ఈ ఏడాది అరభంలో వచ్చిన 'పలాస 1978' చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు కరుణ కుమార్.. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో మారుమ్రోగుతున్నాయి.. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని హీరో అల్లు అర్జున్ తెలిపాడు. తాను సినిమా చూశానని.. వ్యక్తిగతంగా ఎంతో నచ్చిందని, గొప్ప అంతర్లీన సందేశంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని బన్నీ తన ట్విటర్‌లో తెలిపాడు.
ఇక ఈ సినిమా చూసిన మరుసటి రోజున దర్శకుడిని కలిసి అభినందించాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ.. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చాలా మంది ప్రతిభావంతులైన దర్శకులు నటులు వస్తున్నారని అలాంటి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని బన్నీ తెలిపాడు.. అటు పలాస చిత్ర యూనిట్ కూడా బన్నీ శుభాకాంక్షలు తెలియజేశాడు.
Congratulations to the entire team of Palasa 1978. Watched it and met the director the very next morning. Wonderful attempt with a great underlying message. It had so many good moments . I personally liked it . pic.twitter.com/gjoqYcxxKm
— Allu Arjun (@alluarjun) October 2, 2020
ఇక ఈ ఏడాది అల వైకుంఠపురుములో చిత్రంతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.. ఇక బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire