Kulasekhar: పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత

Tollywood Famous Lyricist Kulasekhar Passes Away
x

Kulasekhar: పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత

Highlights

RIP Kulasekhar: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత కులశేఖర్ కన్నుమూశారు.

RIP Kulasekhar: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కుల శేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు 100 సినిమాలకి పైగా పాటలు రాసి తిరుగులేని రైటర్గా ఎదిగిన కులశేఖర్.. 15, ఆగస్ట్‌ 1971న సింహాచలంలో జన్మించారు. స్కూల్లో ఉన్నప్పుడు పాటలు రాసి బహుమతులు అందుకున్నారు కులశేఖర్‌. తర్వాత జర్నలిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టారు. సాహిత్యం మీద ఆసక్తి ఉండడంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెళకువలు తెలుసుకున్నారు.

తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'చిత్రం’ సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. చిత్రంలో పాటలన్నీ ఆయనే రాశారు. ఆర్‌.పి.పట్నాయక్‌, తేజలతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. చిత్రం, జయం, రామ్మా! చిలకమ్మా, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు వంటి చిత్రాలకు ఆయన సాహిత్యం అందించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories