అందాల రాముడు సునీల్ కు పుట్టినరోజు జేజేలు!

అందాల రాముడు సునీల్ కు పుట్టినరోజు జేజేలు!
x
సునీల్ (ఫైల్ ఫోటో)
Highlights

ఆ భీమవరం బుల్లోడికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. సినిమాలు చూడడంతోనే రోజంతా గడిపేసే వాడు. చిరంజీవి సినిమాలు చూసి అలాగే డాన్స్ లు చేసి.. చిరంజీవిలా మాట్లాడుతూ.. ఇతర హీరోలను అనుకరిస్తూ తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేవాడు.

ఆ భీమవరం బుల్లోడికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. సినిమాలు చూడడంతోనే రోజంతా గడిపేసే వాడు. చిరంజీవి సినిమాలు చూసి అలాగే డాన్స్ లు చేసి.. చిరంజీవిలా మాట్లాడుతూ.. ఇతర హీరోలను అనుకరిస్తూ తన చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకునేవాడు. ఇక అదే పిచ్చితో.. సినిమాల్లో నటించేయాలని హైదరాబాద్ వచ్చేశాడు. తనున్న స్థితిలో సినిమాల్లో అవకాశాలు ఎలా వస్తాయన్న ఆలోచనా ఆ సమయంలో అతనికి లేదు. హైదరాబాద్ లో అతనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మంచి స్నేహితుడు దొరికాడు. ఇద్దరూ కల్సి సినిమాల్లో అవకాశాల కోసం పిచ్చి ప్రయత్నాలు చేశారు.

మెల్లగా అవకాశాలు దొరికాయి. మొదట చిన్న వేషాలు.. తరువాత కామెడీ నటుడిగా హీరో పక్కన కనబడే పాత్రలు.. తరువాత సినిమా అంతా కామెడీని భుజాల మీద మోసేలాంటి క్యారేక్టర్లూ.. ఇలా సినీ ప్రస్థానం సాగిస్తూ హీరోగా వెండితెర మీద వెలిగే అవకాశాల్ని పొందాడు ఈ అందాల రాముడు. ఈపాటికి అయన ఎవరో మీకు అర్ధం అయిపోయి ఉండాలి. అవును.. సునీల్! తెలుగు సినీ పరిశ్రమలో స్వశక్తి తో పైకి వచ్చిన వారిలో ఒకడు. ఎదిగినా ఒదిగి ఉండే తత్వంతో అందరి మెప్పూ పొందిన వాడు. సునీల్ పుట్టినరోజు నేడు (28 ఫిబ్రవరి). ఈ సందర్భంగా సునీల్ సినీ ప్రస్థానం పై ఓ లుక్కేడ్డామా!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది హాస్య నటులు ఉన్నారు. వారు తమ హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇదే విధంగా సునీల్ కూడా పరిశ్రమకి వచ్చారు. కాకపోతే కమెడియన్ అవుదామని కాదు.. విలన్ అవుదామనుకున్నారు.

సునీల్‌గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసులో తండ్రి స్వర్గస్తులయ్యారు.దీంతో అతని తల్లికి తండ్రి ఉద్యోగం వచ్చింది.

చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపుల్లేరులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ఉండి ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు)వచ్చేవాడు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.

సునీల్ సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా సుమారు 10 చిత్రాలలో హీరోగా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న (సినిమా) కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.

సినీ పరిశ్రమలో ఎత్తూ పల్లాలు సహజం. హీరోగా సునీల్ కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగడం లేదు. అందుకే అయన మళ్ళీ తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించే పాత్రల్లో ఇటీవలి కాలంలో మెరుస్తున్నారు. ఒక పక్క హీరోగా డ్యాన్సులూ, ఫైట్లూ ఇరగదీస్తూనే.. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సునీల్ కు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగు సినీ ప్రేక్షక లోకం!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories