Ayodhya Ram Mandir: శ్రీరామదాసు దర్శకుడిగా నా జన్మ ధన్యమైంది.. టాలీవుడ్ ప్రముఖుల స్పందన

Ayodhya Ram Mandir: శ్రీరామదాసు దర్శకుడిగా నా జన్మ ధన్యమైంది.. టాలీవుడ్ ప్రముఖుల స్పందన
x
Ram Mandir
Highlights

Ayodhya Ram Mandir: కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరడానికి తోలి అడుగు పడింది.

Ayodhya Ram Mandir: కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరడానికి తోలి అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పరిమిత సంఖ్యలో హాజరయిన అతిధుల మధ్యలో పండితులు ప్రధాని మోడ్ తో మధ్యాహ్నం సరిగ్గా 12:44 గంటల సమయంలో రామ మందిర నిర్మాణానికి శంకు స్థాపన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, మాజీ సీఎం ఉమాభారతి, యోగా గురు రామ్‌దేవ్‌ బాబా, పలువురు పీఠాధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మోదీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ఇలాంటి శుభ పరిణామంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావు .. ''భారతీయులందరి బంగారు కల నెరవేరుతున్న రోజు... శ్రీరామదాసు దర్శకుడిగా నా జన్మ ధన్యం. జై శ్రీరామ్... రామరాజ్యం వచ్చేస్తోంది. జై శ్రీరామ్''.. అంటూ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు.


అదేవిదంగా మరోవైపు నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. '' అందరికీ వందనం. ఈరోజు చాల శుదినం. ఇది ఎన్నాళ్లో మనం వేచిఉన్న ఉదయం ఆనందిస్తుంది ప్రతీ ఒక్కరి హృదయం. పవిత్ర సరయు నదీ తీరానా ప్రభవించిన అయోధ్య పుణ్యక్షేత్రనా జరుగుతోంది నేడు రామమందిర శంకుస్థాపన. వినిపించాలి నలు దిశల రామ నమ సంకీర్తన. పరిమలించాలి మానవత్వం పారిజాతమై ప్రపంచాన.. శ్రీరాముడు అందరివాడు మానవీయతను మనసారా ప్రేమించే వాడు.. మనిషిని మనిషిగా ప్రేమించడమే హైందవ జీవన సిద్ధాంతం అని నమ్మిన వాడు. ఉన్నతమైన భావాలు, ఉదార్తమైన సత్యాలు విశ్వమంతటి నుంచి ఆహ్వానిన్చాలన్నవైదిక వంగ్మిక తోలి గ్రందమైన ఋగ్వేదం ప్రవచించిన క్రమ సూత్రాన్ని పాటించిన వాడు.. అటువంటి ఆదర్శ రాముడు, అజేయ రాముడికి, ఆత్మీయ రాముడికి, మన అయోధ్య రాముడికి నమో నమః''.. అంటూ ట్వీట్ చేసారు.

మరోవైపు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుడా రామ మందిరం శంకుస్థాపన అంశంపై మాట్లాడుతూ.. ''అయోధ్య రాముడు ఆనందించేలా, భారతదేశం గర్వించేలా, ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా, ఎదురులేని తిరుగులేని, మొక్కవోని సాహసంతో పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ శతథా సహస్రథా వందనం అభివందనం''.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories