సీఎం కేసీఆర్ కి చిరంజీవి, నాగార్జున కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్ కి చిరంజీవి, నాగార్జున కృతజ్ఞతలు
x
Highlights

కరోనా కారణంగా కుదేలైన సినీ పరిశ్రమకి తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడం పట్ల సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కరోనా కారణంగా కుదేలైన సినీ పరిశ్రమకి తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడం పట్ల సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.." కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ కేసీఆర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట్టమయంలో ఇండస్ట్రీ కీ, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంతో తోడ్పాటు గా వుంటాయి. కేసిఆర్‌ గారి నేతృత్వంలో, ఆయన విజన్‌ కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ది సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది" అని చిరంజీవి ట్వీట్ చేశారు.

"కోవిడ్ లాంటి అనిశ్చిత సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలిచి అవసరమైన సహాయక చర్యలను అందిస్తున్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారుకు చాలా కృతజ్ఞతలు " అని నాగార్జున ట్వీట్ చేశారు. ఇక రామ్ చరణ్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. " తెలుగు చలన చిత్ర పరిశ్రమ తిరిగి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి గాను సహాయక చర్యలకు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ట్వీట్ చేశారు రామ్ చరణ్!

ఇక గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై వరాల జల్లు కురిపించారు. కరోనా వలన నష్టపోయిన సినిమా పరిశ్రమకి భారీ రాయితీలు ప్రకటించారు. సినిమా ధియెటర్లు, పరిశ్రమలకు, అన్ని రకాల షాపులకు వచ్చిన కరెంట్ బిల్లును ( మినిమం డిమాండ్ చార్జీ ) చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు ఇది వర్తిస్తుందని అన్నారు. ఇక అన్ని రకాల ధియేటర్లలలో షోలు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తరహలో సినిమా టికెట్ల ధరలను సవరించే వెసులుబాటును కల్పించారు.

అటు రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు SGST రీయంబర్స్ మెంట్ సాయం చేస్తామని వెల్లడించారు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories