వెండితెరపై మహాశివుడిగా కనిపించింది వీరే..

వెండితెరపై మహాశివుడిగా కనిపించింది వీరే..
x
Highlights

తెలుగులో ఆధ్యాత్మికతకి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

తెలుగులో ఆధ్యాత్మికతకి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక అందులో భోలాశంకరుడి పైన కొన్ని చిత్రాలను దర్శకులు తెరకెక్కించారు. పరమశివుడిగా మహాదేవుని వేషం మన అగ్ర హీరోలు మెప్పించారు. అలా మహాశివుడిగా కనిపించిన మన తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీ రామారావు :

ఎన్టీఆర్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కృష్ణుడు, రాముడు మాత్రమే.. కానీ అయన శివుడిగా కనిపించి మెప్పించారు కూడా.. 'దక్షయజ్ఞం',' ఉమా చండీ గౌరీ శంకరుల కథ' సినిమాల్లో శివుడి వేషంలో నటించారు. ప్రతి శివరాత్రికి ఏదో ఒక తెలుగు ఛానెల్‌లో దక్షయజ్ఞం సినిమా వస్తుంది.

అక్కినేని నాగేశ్వరరావు :

అక్కినేని ఎక్కువ సాంఘిక చిత్రాలు చేసినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'మూగ మనసులు' సినిమాలోని గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించారు.

శోభన్ బాబు :

ఎన్టీఆర్ హీరోగా నటించిన 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాలో శోభన్ బాబు శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

రావు గోపాల్ రావు:

విలక్షణమైన నటుడుగా పేరు తెచ్చుకున్న రావు గోపాల్ రావు కూడా శివుడి వేషంలో కనిపించారు.. 'మావూళ్లో మహాశివుడు' సినిమాలో అయన మహాశివుడుగా మెప్పించగా భక్తుడిగా కైకాల సత్యనారాయణ నటించారు.

కృష్ణంరాజు :

కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'వినాయక విజయం' సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు శివుని వేషంలో మెప్పించారు.

చిరంజీవి :

అర్జున్ , సౌందర్య హీరో హీరోయిన్స్ కే.రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీ మంజునాథ' సినిమాలో చిరంజీవి శివుడి వేషంలో కనిపించారు. దీనికి ముందు అయన విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆపద్భాందవుడు' సినిమాలోని ఓ పాటలో కనిపించారు.

నాగార్జున :

భారవి దర్శకత్వంలో తెరకెక్కిన 'జగద్గురు ఆది శంకర' చిత్రంలో అక్కినేని నాగార్జున శివుడి పాత్రలో కనిపించారు.

జగపతిబాబు :

మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిన కొత్తలో సినిమాలో జగపతిబాబు ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు..

ఇక వీరు మాత్రమే కాకుండా సుమన్, ప్రకాష్ రాజ్, కమెడియన్ మల్లిఖార్జున రావు, రాజనాల, నాగ భూషణం తదితరులు శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories