Uday Kiran Birth Anniversary: ఉదయ్ కిరణ్ జయంతి నేడు..

Uday Kiran Birth Anniversary: ఉదయ్ కిరణ్ జయంతి నేడు..
x
Highlights

Uday Kiran Birth Anniversary: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పైకొచ్చిన నటులలో ఉదయ్ కిరణ్ ఒకడు..

Uday Kiran Birth Anniversary: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పైకొచ్చిన నటులలో ఉదయ్ కిరణ్ ఒకడు.. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు.. ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వే నువ్వే, మనసంతా నువ్వే సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఉదయ్ కిరణ్ స్టార్డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది...అంతేకాకుండా ఆ సినిమాలకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఉదయ్ కిరణ్ ను వరించాయి..దీనితో ఉదయ్ కిరణ్ కి లవర్ బాయ్ అనే ఇమేజ్ యూత్ లో బలంగా పడిపోయింది..

మూడు సినిమాలతో వచ్చిన హిట్స్ తో మరింత ముందుకు సాగాడు ఉదయ్ కిరణ్.. కానీ ఆ తరవాత వచ్చిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ముందు సినిమాల లాగా అలరించలేకపోయాయి.. దీనితో వరుస ఫ్లాపులను చవిచూశాడు ఉదయ్ కిరణ్.. దీనికితోడు వ్యక్తిగత కారణాలు మరింతగా తోడు అయ్యాయి..అయనప్పటికి వాటిని ఎదురుకుంటూ ముందుకు సాగాడు.. ఇక మళ్లీ తేజ దర్శకత్వంలో వచ్చిన ఔనన్నా కాదన్నా సినిమా ఉదయ్ కెరీర్ ను నిలబెట్టింది.. మళ్లీ గాడిలో పడ్డట్టే కనిపించిన మళ్లీ వరుసగా ప్లాపులు అతనికి ఎదురయ్యాయి..

ఇక ఆ తర్వాత వచ్చిన వియ్యాలవారి కయ్యాలు గుండెఝల్లుమంది, ఏకలవ్యుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, పెద్దోళ్ళున్నారే, జై శ్రీరామ్ మొదలగు చిత్రాలు ఉదయ్ కిరణ్ ను తీవ్రంగా నిరాశపరిచాయి.. అటు తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పటికీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండడంతో మరింతగా కృంగిపోయాడు ఉదయ్.. చేసిన సినిమాలు హిట్ కాకోవడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లి పోయి 2014 జనవరి 06 న మనికొండ లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. 2012లో అక్టోబరు 24న విషితను పెళ్లి చేసుకున్నాడు ఉదయ్ కిరణ్..

భౌతికంగా ఉదయ్ కిరణ్ మన మధ్య లేనప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎప్పటికి చిరస్థాయిలో నిలిచిపోతాడు. ఈ రోజు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు(uday kiran birthday) కావడంతో ఉదయ్ కిరణ్ స్మృతులను మనం గుర్తుచేసుకుందాం..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories