Pawan Kalyan About Movies: షూటింగ్స్ పై పవన్ క్లారిటీ.. వ్యాక్సిన్ వచ్చాకే...

Pawan Kalyan About Movies: షూటింగ్స్ పై పవన్ క్లారిటీ.. వ్యాక్సిన్ వచ్చాకే...
x
Pawan Kalyan (File Photo)
Highlights

Pawan Kalyan About Movies: కరోనా విలయంలో షూటింగ్స్ మొదలు పెట్టే విషయంలో పవన్ క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan About Movies: కరోనా విలయంలో షూటింగ్స్ మొదలు పెట్టే విషయంలో పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఓకే చెప్పినా తాను వ్యాక్సిన్ వచ్చాకే కెమెరా ముందుకు వెళతానని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అనంతరం ఇటీవల షూటింగులు ప్రారంభించిన కొంతమంది వెంటనే వారిలో ఉన్నవారికి కరోనా సోకడంతో వాయిదా వేశారు. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పవన్ ముందుగానే క్లారిటీ ఇచ్చారు.

ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట వెంట‌నే సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌రోనా వైర‌స్ చెక్ పెట్టింది. ఇప్ప‌టికే త‌న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా, డైరెక్ట‌ర్ క్రిష్, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వాల్లో సినిమా చేసేందుకు ప‌వ‌న్ ఓకే చెప్పేశాడు.

ప్ర‌భుత్వం సినిమా షూటింగ్స్ కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ… విధించిన‌ కరోనా ష‌ర‌తులతో సినిమా షూటింగ్స్ ప‌ట్టాలెక్క‌లేదు. అతి త‌క్కువ మందితో సినిమాలు తీయ‌టం అసాధ్య‌మంటూ అంద‌రూ వాయిదా వేసుకున్నారు. తాజాగా త‌న సినిమా షూటింగ్స్ పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్… వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశాడు.

ముఖ్య‌మైన న‌టీ న‌టులకు వ‌చ్చినా, ఇత‌రుల‌కు వ‌చ్చినా ఇబ్బందే. వ‌య‌స్సు పైబ‌డిన వారికి వ‌స్తే క‌ష్టం క‌దా అంటూ వ్యాక్సిన్ వ‌స్తేనే షూటింగ్స్ అంటూ చెప్ప‌క‌నే చెప్పేశాడు. కానీ వ్యాక్సిన్ 2021మొద‌ట్లో కానీ, ఈ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో కానీ వ‌స్తుంద‌న్న చ‌ర్చ ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. అంటే ఎటూ కాద‌న్న క‌నీసం మ‌రో ఆరు నెల‌లు అయినా ఆగాల్సిందేన‌న్న మాట‌.


Show Full Article
Print Article
Next Story
More Stories