Nithiin-shalini mehndi ceremony : మెహందీలో మెరసిన షాలిని-నితిన్‌!

Nithiin-shalini mehndi ceremony : మెహందీలో మెరసిన షాలిని-నితిన్‌!
x
Nithiin, Shalini Mehandi Ceremony
Highlights

Nithiin-shalini mehndi ceremony: టాలీవుడ్ లో మొన్నటి వరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే..

Nithiin-shalini mehndi ceremony: టాలీవుడ్ లో మొన్నటి వరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. ఆదివారం రాత్రి 8.30 గంటలకు నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఇక అటు ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్ళికి ముందు నిర్వహించే మెహందీ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.

ఇందులో నితిన్ - షాలిని చేతులకు మెహందీ పెట్టుకొని మెరిసిపోతున్నారు. రెడ్‌ కలర్‌ లెహంగాలో షాలిని కనిపించగా, నితిన్‌ బ్లూ కలర్‌ కుర్తాలో కళ్లకు డిఫరెంట్‌ గాగూల్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నితిన్‌ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్‌ డిజైనర్‌ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నితిన్ షాలినిల నిశ్చితార్థం ఫిబ్రవరి15న జరిగిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఏప్రిల్ 16 న వీరి వివాహాన్ని గ్రాండ్ గా దుబాయ్ లో చేయాలని ముందుగా ఇరువురు కుటుంబ సభ్యులు భావించారు. కానీ అప్పుడే దేశంలో కరోనా వ్యాప్తి ఎంటర్ కావడంతో వివాహాన్ని వాయిదా వస్తూ వచ్చారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నితిన్ పెళ్లి జరుగుతుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.

అటు నితిన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ విజయాన్ని అందుకున్నాడు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.


Show Full Article
Print Article
Next Story
More Stories