RRR పై ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన నాగబాబు

RRR పై ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన నాగబాబు
x
Nagababu (File Photo)
Highlights

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమా పైన మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానల్ 'మై ఛానల్ నా ఇష్టం' ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగబాబు RRR సినిమా గురించి మాట్లాడుతూ.. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ప్రోమో చూశానని, ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ప్రోమో చూడాలని ఎంతో ఆతృతగా ఉందని నాగబాబు వెల్లడించారు.

"అల్లూరి సీతారామరాజు, కొమురం భీం సమకాలీనులా? కాదా? అనేది అయితే నాకైతే తెలియదు కానీ.. ఆ ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కథతో ఈ మూవీ రూపొందుతోందని బయట టాక్ నడుస్తోంది. అది నిజమో కాదో చెప్పలేం.. బట్ ఇలాంటి ఊహాగానాలు RRRపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయని" అన్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories