This Week Movies And OTT Release: రీరిలీజ్‌తో పాటు కొత్త చిత్రాలు.. ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో సందడే సందడి..!

This Week Movies And OTT Release
x

This Week Movies And OTT Release

Highlights

This Week Movies And OTT Release: ఎప్పటిలాగే మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి.

This Week Movies And OTT Release: ఎప్పటిలాగే మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ వారం ఎవర్‌ గ్రీన్‌ మూవీస్‌ రిరిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే కొత్త చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి. మరి ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.

* ఈ వారం థియేటర్లలోకి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీస్‌లో గొర్రె పురాణం ఒకటి. సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్‌ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

* 2006లో వచ్చిన బొమ్మరిల్లు మూవీ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం. ఇప్పుడీ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సిద్ధార్థ్‌, జెనీలియ జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో విడుదలవుతోంది.

* ఇక జర్నీ మూవీ కూడా రీరిలీజ్‌ అవుతుంది. జై, శర్వానంద్‌, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 21వ తేదీన మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

* ఈ వారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ మూవీస్‌..

* ఈ వారం డిస్నీ+ హాట్‌ స్టార్‌ వేదికగా అన్‌ ప్రిజన్డ్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 16వ తేదీన, అగాథ ఆల్‌ ఎలాంగ్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17వ తేదీన, ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (తెలుగు) సెప్టెంబరు 20వ తేదీన, ది జడ్జ్‌ ఫ్రమ్‌ హెల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 21వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

* ఇక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 16న, కలినరీ క్లాస్‌ వార్స్‌ (కొరియన్‌) సెప్టెంబరు 17, ఫాస్ట్‌ ఎక్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 18న, లివ్‌ ఫ్రమ్‌ ది అదర్ సైడ్‌ (ఇంగ్లీష్‌ టాక్‌ షో) సెప్టెంబరు 18న

ట్విలైట్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ (వెబ్‌సిరిస్‌) సెప్టెంబరు 19, మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19, హిజ్‌ త్రీ డాటర్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 20, ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో2 (టాక్‌ షో) సెప్టెంబరు 21, ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 21న స్ట్రీమింగ్ కానున్నాయి.

* అమెజాన్‌ ప్రైమ్‌లో ఎ వెరీ రాయల్ స్కాండిల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19వ తేదీన స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

* ఇక జియో సినిమా వేదికగా దుర్గ (హిందీ) సెప్టెంబరు 16న, జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20న, ది పెంగ్విన్‌ (వెబ్‌సిరీస్‌) (సెప్టెంబరు 29)వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories