Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ గురించి 6 ముఖ్యమైన పాయింట్స్ ఇవే...

These are 6 important points about Junior NTR Devara
x

Devara: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ గురించి 6 ముఖ్యమైన పాయింట్స్ ఇవే...

Highlights

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే యూట్యూబ్‌లో నంబర్ల మోత మోగిస్తున్నాయి. కొరటాల శివ...

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే యూట్యూబ్‌లో నంబర్ల మోత మోగిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా, ఆర్ఆర్ఆర్ వంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.

సెప్టెంబర్ 27న విడుదలవుతున్న దేవర్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలివే.

1. దేవర సినిమా రెండు పార్ట్స్‌గా రాబోతోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారు. తండ్రి దేవరగా, కొడుకు వరదగా ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. తండ్రి సముద్రాన్ని కాపాడేవాడు అయితే, కొడుకు అందుకు పూర్తిగా వ్యతిరేకి అని వార్తలు వచ్చాయి. అసలు కథేమిటో వెండితెర మీద చూడాల్సిందే.

2. శ్రీదేవి కూతురు జాహ్నవి ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. అలనాటి లేడీ సూపర్ స్టార్ వారసురాలు, నటరత్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండడంతో న్యూజనరేషన్ గ్లామర్ కాంబినేషన్ ఈ సినిమాకు కిక్కు పెంచుతోంది.

3. ఈ చిత్రానికి సెంట్రల్ సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తం నాలుగు కట్స్ పడ్డాయి. మూడు కట్స్ హింస మరీ ఎక్కువగా ఉండడం వల్ల పడితే, ఒకటి మాత్రం షార్క్ విజువల్ మీద సీజీఐ మార్క్‌కు సంబంధించి.

4. విలన్ భైరా పాత్రలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తీర ప్రాంత గ్రామానికి చెందిన సముద్ర దొంగల ముఠాకు ఆయన నాయకుడు. తీర ప్రాంతానికి గస్తీ కాసే గార్డులను ఊచకోత కోస్తుంటాడు భైరా. ఈ చిత్రంలో భైరా ఒకప్పుడు దేవరకు మిత్రుడే. తరువాత వెన్నుపోటు పొడిచి శత్రువుగా మారతాడు.

5. రెండు భాగాలుగా రాబోతున్న దేవర చిత్రాన్ని రూ. 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారని సినిమా వర్గాలు తెలిపాయి.

6. నార్త్ అమెరికాలో దేవర ఇప్పటికే బాక్సాఫీసును ఓ మోత మోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు ఇప్పటికే 1.73 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 14.5 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పెరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్‌ను దేవర తిరగరాస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories