Dhoom 4: 'ధూమ్ 4'లో హీరో సూర్య.. విలన్‌ పాత్రలో రోలెక్స్..?

Hero Suriya In Dhoom 4
x

Hero Suriya In Dhoom 4

Highlights

Dhoom 4: ధూమ్ ఫోర్‌ విలన్ పాత్రలో సూర్య తమిళ స్టార్ సూర్య నటిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది.

Dhoom 4: యష్ రాజ్ ప్రొడక్షన్స్ యాక్షన్-థ్రిల్లర్-డ్రామా చిత్రం 'ధూమ్' బ్లాక్ బస్టర్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలో మూడు పార్ట్‌లు వ‌చ్చి మూడు పార్ట్‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నాల్గవ చిత్రం ధూమ్ 4 గురించి బజ్ ఉంది. మేకర్స్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నాలుగో భాగం వార్తల్లో నిలిచింది. ‘ధూమ్ 4’లో నెగిటివ్ రోల్స్ కోసం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినిమాలో విలన్ పాత్ర కోసం సౌత్ సూపర్ స్టార్ సూర్య పేరు తెరపైకి వస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. 'ధూమ్' సిరీస్ నాల్గవ భాగం కోసం తమిళ సూపర్ స్టార్ సూర్య శివకుమార్‌ను సంప్రదించారు.

సినిమా విలన్‌గా నటించే ఆఫర్‌ వచ్చింది. "మేకర్లు ఒక పాత్ర కోసం సూర్యను సంప్రదించారు, చర్చలు జరుగుతున్నాయి" అని నివేదికలు పేర్కొన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు మనోబాల విజయ్ బాలన్ తన ఎక్స్ ఖాతాలో ఈ సమాచారాన్ని అందించారు. సూర్య, మేకర్స్ మధ్య చర్చలు సానుకూలంగా ఉంటే తమిళ స్టార్ సూర్య ధూమ్ 4 లో విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. అయితే నిర్మాతలు ధూమ్ 4 గురించి ఇంకా ప్రకటించలేదు.

అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాన్ అబ్రహం, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధూమ్' 2004లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమా. దీని తరువాత దాని సీక్వెల్ ధూమ్ 2 2006లో, ధూమ్ 3 2013లో విడుదలైంది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories