Kalki: భారతీయ పురాణాలకు ముగింపు కల్కి.. నాగ్‌ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

The Prelude Of Kalki 2898 AD - Episode 1 Director nag ashwin reveals about kalki movie story plot
x

Kalki: భారతీయ పురాణాలకు ముగింపు కల్కి.. నాగ్‌ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Highlights

భారీ బడ్జెట్‌తో ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌ వంటి తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది.

Kalki: ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కల్కి 1898 ఏడీ'. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా నాగ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌ వంటి తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను జూన్‌ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న క్రమంలో చిత్ర యూనిట్‌ ఈ సినిమా ప్రమోషన్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్‌.

ఈ నేపథ్యంలోనే కల్కి కథ గురించి దర్శకుడు నాగ అశ్విన్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'వరల్డ్‌ ఆఫ్‌ కల్కి' పేరుతో కొన్ని ఎపిసోడ్స్‌ రూపంలో ఈ సినిమా విషయాలను నాగ్‌ అశ్విన్‌ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎపిసోడ్‌-1 విడుదలైంది. ఇందులో కల్కి కథ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా కథ రాయడానికి ఐదేళ్లు పట్టిందన్న నాగ అశ్విన్‌.. భారతీయ పురాణాలు అన్నింటికి క్లైమాక్స్ లాగా కల్కి ఉంటుందని చెప్పుకొచ్చారు. కలియుగంలో జరగబోయే అంశాలను ఇందులో చూపించామని చెప్పుకొచ్చిన నాగ అశ్విన్‌, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరూ దీనికి కనెక్ట్‌ అవుతారని ఆయన తెలిపారు.

సినిమా కథ గురించి మరిన్ని వివరాలు చెబుతూ.. 'మన పురాణాల ప్రకారం కృష్ణుడి అవతారంతో ముగింపు పలికి కలియుగం ప్రారంభం అవుతుంది. కృష్ణుడి అవతారం తర్వాత పదో అవతారం కల్కి. కలియుగంలో ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా. కలి అనే వాడు ప్రతీ యుగంలో ఉంటాడు. కానీ రూపం మారుతుంది. ఒకసారి రావణుడిలా, దుర్యోధనుడిలా ఉంటే చివరగా కలియుగంలో ఎలా ఉంటాడు.. అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడనే ఆలోచనతో రాసిన కథ ఇది. అని చెప్పుకొచ్చారు. నాగ అశ్విన్‌ పంచుకున్న ఈ అంశాలతో కల్కిపై అంచనాలు మరింత పెరిగాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories