Pailam Pilaga: సెప్టెంబర్ 20న రానున్న పైలం పిలగా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలయ్య..

Pailam Pilaga: సెప్టెంబర్ 20న రానున్న పైలం పిలగా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలయ్య..
x

Pailam Pilaga: సెప్టెంబర్ 20న రానున్న పైలం పిలగా.. ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలయ్య..

Highlights

Pailam Pilaga: ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్‌లో సందడి చేసేందుకు రాబోతున్న సినిమా 'పైలం పిలగా'.

Pailam Pilaga: ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్‌లో సందడి చేసేందుకు రాబోతున్న సినిమా 'పైలం పిలగా'. 'పిల్ల పిల్లగాడు' వెబ్ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరో‌గా, పుష్ప, పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్‌గా యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి సింగల్ 'సోడు సోడు' పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేయగా, టీజర్‌ని డైరెక్టర్ హరీష్ శంకర్, ట్రైలర్‌ను డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేశారు. మంచి పాటలు, ఎంటర్టైనింగ్ టీజర్, ఎంగేజింగ్ ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇటీవల బాలయ్య బాబు ఈ 'పైలం పిలగా' చిత్ర టీజర్, ట్రైలర్‌ను చూసి మూవీ టీంని ప్రశంసించారు. టీజర్, ట్రైలర్ లోని డైలాగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ నటీనటులు, సాంకేతిక వర్గం, షూటింగ్ విశేషాలను అడిగి తెలుసుకున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.

పైసాను ప్రేమించే పిలగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల. మేఘాల్లో మేడలు కట్టుకోవాలని కలలు కనే మొనగాడు, చెట్టు కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ ఒకవైపు.. ఎక్కడికైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్లి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే ఆరాటం ఇంకోవైపు.. ఈ ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని వినోదాత్మకంగా తెలిపే హాస్యభరిత వ్యంగ్య చిత్రమే 'పైలం పిలగా' అని మూవీ యూనిట్ పేర్కొంది.

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌లో తొలి సినిమాగా 'పైలం పిలగా'ను రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ సినిమాకి రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories