నాని సినిమాతో లాసులు బన్నీ సినిమాతో ప్రాఫిట్‌లు

నాని సినిమాతో లాసులు బన్నీ సినిమాతో ప్రాఫిట్‌లు
x
Highlights

పోయిన చోటే వెతుక్కోవలి అనే సామెత సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే వారికి బాగానే వర్తిస్తుంది. ఒక హీరోతో నష్టాలు అనుభవించిన బయ్యర్లు మరొక హీరో సినిమా తో...

పోయిన చోటే వెతుక్కోవలి అనే సామెత సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే వారికి బాగానే వర్తిస్తుంది. ఒక హీరోతో నష్టాలు అనుభవించిన బయ్యర్లు మరొక హీరో సినిమా తో లాభాలు అందుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నాని సినిమా తో నష్టాలు అందుకున్న నిర్మాణ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తో లాభాలు పొందాలని ఆశిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నాని హీరోగా గౌతమ్ మీనన్ తిన్ననూరి దర్శకత్వం వహించిన 'జెర్సీ' సినిమాను నిర్మించారు. అయితే అదే రోజున రాఘవ లారెన్స్ హీరోగా నటించిన 'కాంచన 3' సినిమా కూడా విడుదల అయింది.

ఒకవైపు జెర్సీ సినిమాలో ఎమోషన్ లకు పెద్దపీట వెయ్యగా 'కాంచన 3' సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ లు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ప్రేక్షకులను కాంచన పైనే దృష్టి పెట్టారు. దీనివల్ల 'జెర్సీ' బయ్యర్లకు 30 శాతం దాకా నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నిర్మాతలు కావాలని బయ్యర్లకు డబ్బులు ఇచ్చేసి కాంచన కంటే ఒక పది శాతం కలెక్షన్లు జెర్సీ కి పెంచారని వదంతులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెర్సీ సినిమాతో నష్టాలు అందుకున్న బయ్యర్లు ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కనీసం ఈ సినిమాతో అయినా మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నవారి కలలు నెరవేరతాయో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories