Thaman: దివ్యాంగ సింగర్‌‌కు​ తమన్ ఛాన్స్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Thaman: దివ్యాంగ సింగర్‌‌కు​ తమన్ ఛాన్స్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
x
Highlights

Thaman give an opportunity to specially abled singer: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో పాట పాడిన ఒక...

Thaman give an opportunity to specially abled singer: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో పాట పాడిన ఒక దివ్యాంగుడికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. దీంతో సామాన్య ప్రజల నుంచి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు. హ్యాట్సాఫ్ తమన్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇటీవల బస్సులో ఒక దివ్యాంగుడుశ్రీ ఆంజనేయం సినిమాలో పాటను అద్భుతంగా పాడారు. తన అద్భుతమైన గాత్రంతో బస్సులో ఉన్న వారిని అలరించారు. అతని పాటను విన్న ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. ఆ యువకుడు పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. అది చూసిన ఆయన దివ్యాంగ సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. అతడికి ఓ అవకాశం ఇవ్వాలని డైరెక్టర్ కీరవాణికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో.. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో తమన్ ఫ్యాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ తమన్‌ని ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన తమన్.. ఆ యువకుడికి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో ఆయన పాల్గొనేలా చూడాలని ఆహా టీమ్‌ను కోరారు. ఆహా వేదిక మీద ఆ యువకుడితో కలిసి పర్‌ఫామ్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు చెప్పారు. ఆ యువకుడికి టాలెంట్ ఉంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో కచ్చితంగా స్పెషల్ పర్‌ఫార్మెన్స్ ఇస్తారు. ఆహా టీమ్‌కు ఇదినా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఆర్డర్ అనుకోండి. కానీ ఆ యువకుడికి మాత్రం అవకాశం కల్పించండి అని థమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఆహా వేదికగా నేను అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా.. అతడిలో చక్కటి టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ పిచింగ్‌లో అద్భుతంగా పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కొంతమంది పట్ల దయలేకుండా వ్యవహరిస్తాడు. కానీ మనం మనుషులం. ఆ యువకుడికి మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి. అందుకే మేం సిద్ధంగా ఉన్నాం అని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.


ఈ ట్వీట్‌పై సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న అంధ యువకుడికి ఆహా నిర్వహిస్తోన్న.. తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుంది. భవిష్యత్తులో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఆ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇటు సజ్జనార్‌పై అటు తమన్‌ పై ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories