తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ రివ్యూ

Tenali Ramakrishna BA.BL
x
Tenali Ramakrishna BA.BL
Highlights

తాజాగా "తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌'' సినిమాతో సందీప్‌ కిషన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ హన్సీకా మోత్వాని, పందెంకోడి-2 చిత్రంలో నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలో నటించారు

ప్రస్థానం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమై అనతి కాలంలోనే హీరోగా ఎదిగిన యువ కథానాయకుడు సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఘన విజయంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. గత చిత్రం నిను వీడను నీడను నేనే కాస్త పర్వాలేదు అనిపించింనా బాక్సాఫీస్ ముందు తేలిపోయింది. ఆ తర్వత నుంచి విభిన్న కథలను ఎంపిక చేసుకుని జాగ్రత్తాగా అడుగులు వేస్తున్నాడు.

తాజాగా "తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌'' సినిమాతో సందీప్‌ కిషన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ హన్సీకా మోత్వాని, పందెంకోడి-2 చిత్రంలో నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలో నటించారు. జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో పూర్తి హాస్యబరిత చిత్రంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ (సందీప్‌ కిషన్‌) న్యాయవాది పాత్రలో చేశారు. క్లయింట్స్‌ తన దగ్గరి వచ్చి కేసులు ఇవ్వకపోవడంతో హీరో టైం పాస్ చేస్తుండాడు. చిన్న కేసులు వచ్చినా పెద్ద కేసు వాదించి తన కొడుకు గొప్ప పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఆ కేసులను తెనాలికి రాకుండా చేస్తుంటాడు అతని తండ్రి దుర్గారావు (రఘుబాబు). కేసులు లేక ఖాళిగా గడుపుతున్న హిరో రుక్మిణి (హన్సిక ) క్రిమినల్ న్యాయవాది చక్రవర్తి( మురళీ శర్శ)తో ప్రేమలో పడతాడు.

కర్నూలు నగరంలో ఓ జర్నలిస్ట్‌ హత్య గావించబడతాడు. ఈ కేసులో సింహాద్రి నాయుడు ( అయ్యప్ప శర్మ) వరలక్ష్మీ దేవి (వరలక్ష్మీ శరత్‌కుమార్) తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా వస్తుందని ఆమెను ఇరికించాలని చూస్తాడు. దీనికి క్రిమినల్ న్యాయవాది చక్రవర్తి సాయం తీసుకుంటాడు. చివరి క్షణంలో వరలక్ష్మీని కోర్టు శిక్షను రక్షిస్తాడు హిరో తెనాలి. ఈనేపథ్యంలో కథానాయకుడు తెనాలికి జర్నలిస్ట్ హత్య గురించి అసలు నిజం తెలుస్తోంది. అసలు జర్నలిస్ట్ హత్య? ఆత్మహత్య? ఎవరు చంపి ఉంటారు అనే నిజయం తెలియాలంటే సినిమా తప్పక చూడాల్సిందే.

టెక్నికల్ విషయానికొస్తే

6 టీన్స్ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రేడీ , కరెంట్ తీగ , ఈడోరకం ఆడోరకం వంటి కామెడీ చిత్రాలతో హిట్స్ కొట్టిన దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను అదే విధంగా ప్లాన్ చేశాడు. సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించిన మొదటి భాగం అంతా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమనే నడిపించాడు. కొన్ని చోట్ల కామెడీ సీన్లు పడించాడు.

ఇంటర్వెల్ సమయానికి ట్విస్ట్‌ తో బ్రేక్‌ ఇచ్చాడు దర్శకుడు. ఇంటర్వేల్ తర్వాత అసలు కథలోకి వెళ్లకుండా కాస్త సాగతీసినట్లు అనిపిస్తుంది. కథానాయకుడు ప్రతినాయకుడి మధ్య ఎత్తు పైఎత్తులతో ఆసక్తిగా నడిపించడంలో తడబడ్డాడు. ఎక్కువ కామెడీనే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రథామార్థం కంటే ద్వితీయార్థంలో వచ్చే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు కొంచెం సాగతీసినట్లు కనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే

నటన పరంగా సందీప్‌ కిషన్‌ తెనాలి రామకృష్ణుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమా అంతా తన ఒక్కడే నడిపించాడు. హన్సిక తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయింది. హన్సిక పాత్రకు ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో ఆమె నిరాశపరిచింది. వరలక్ష్మీ దేవిగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ సినిమా పాత్రకు కావాల్సిన హుందాతనం చూపించడంతో పూర్తి స్తాయిలో సక్సెస్ అయింది. కామెడియన్లు వెన్నెల కీషోర్ , సప్తగిరి, రఘుబాబు తదితరులు న్యాయం చేశారు.

సంగీతం

ఇక సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చిత్రంలోని పాటలు బాగున్నాయి. కొన్ని సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ డామినేట్ చేసిందన్న అభిప్రాయం ప్రేక్షకులకు కలుగుతోంది.

నిర్మాణతలు నాగిరెడ్డి, సంజీవివ్ రెడ్డి, రూప జగదేష్ చిత్రం నిర్మణా విషయంలో విలువల్లో ఎక్కడా రాజీపడలేదు.

ప్లస్ పాయింట్స్

కామెడీ

సందీప్ కిషన్ నటన

మైనస్ పాయింట్స్

కథ, కథనం

ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడం

సినిమా రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే, సమీక్షకుడి కోణంలో చూడబడినది. సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాల్సిందిగా కోరుతున్నాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories