వెండితెరపై ఓ వెలుగు వెలిగి మాయమయిపోయారు

వెండితెరపై ఓ వెలుగు వెలిగి మాయమయిపోయారు
x
Highlights

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి బండ్లు ఓడలు అవుతాయి. ఓడలు బండ్లు అవుతాయి. అలాగే ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలు చేసి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది హీరోలు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అందులో కొందరు కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. అందులో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వడ్డే నవీన్ :

వడ్డే రమేష్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్... కోరుకున్న ప్రియుడు, పెళ్లి, చాలా బాగుంది, మా ఆవిడా మీద ఒట్టు మీ ఆవిడా చాలా మంచిది లాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించి నవీన్ కి హీరోగా మంచి పేరును తీసుకువచ్చాయి. ఇక 2000 సంవత్సరం తర్వాత ఆయన చేసిన ఎ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఇక చివరగా ఆయన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో నటించారు. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

తరుణ్ :

లవర్ బాయ్ అనే పదానికి పర్ఫెక్ట్ తరుణ్.. బాలనటుడుగా చిత్రపరిశ్రమకి పరిచయం అయిన తరుణ్ నువ్వేకావాలి సినిమాతో హీరోగా మారాడు.. మొదటి సినిమానే ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలు మంచి హిట్ అయి తరుణ్ ని స్టార్ హీరోలలో ఒకరిని చేశాయి. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తుండడంతో తరుణ్ ఫేడవుట్ అయిపోయాడు. కానీ తరుణ్ మళ్ళీ నటించాలని కోరుకునే అభిమానులు కోకొల్లలు ఉన్నారు.

వేణు తొట్టెంపూడి:

స్వయంవరం సినిమాతో చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు హీరో వేణు.. ఆ తర్వాత చేసిన చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. ఆ తర్వాత మాత్రం చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో అడలేకపోయాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దమ్ము సినిమాలో ఓ చిన్న పాత్ర చేసినప్పటికీ అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేకపోయాయి. దీనితో మళ్ళీ వెండితెరపై వేణు కనిపించింది లేదు..

శివ బాలాజి:

'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు శివ బాలాజి... ఆ తర్వాత ఎలా చెప్పను, ఆర్య, సంక్రాంతి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ మంచి విజయాన్ని అయితే ఇచ్చింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా శివబాలాజీ జెండాపై కపిరాజు అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్ తర్వాత అయిన విజయాలు అయిన వస్తాయి అనుకుంటే అది లేదు. దీనితో శివబాలాజీ మళ్ళీ వెండితెరపై కనిపించింది లేదు..

ఆర్యన్ రాజేష్:

టాలీవుడ్ లో గ్రేట్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచినా ఈవివి సత్యనారాయణ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆర్యన్ రాజేష్.. హాయ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సొంతం, ఎవడిగోల వాడిది లాంటి మంచి హిట్లను సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో అడలేకపోయాయి. ఇక చివరగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ సినిమాలో రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించి మెప్పించారు.

ఇక ఇలాంటి హీరోలు చాలానే ఉన్నారు. వారందరూ మళ్ళీ నటించాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories