మిర్యాలగూడ ప్రణయ్ హత్య నేపథ్యంలో తెరకెక్కిన మర్డర్ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూవీ రిలీజ్‌పై నల్గొండ కోర్టు ఇచ్చిన...
మిర్యాలగూడ ప్రణయ్ హత్య నేపథ్యంలో తెరకెక్కిన మర్డర్ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూవీ రిలీజ్‌పై నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను ధర్మాసనం కొట్టివేసింది. అయితే మర్డర్ సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. దీంతో ప్రణయ్, అమృత పేర్లు వాడబోమని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్. హైకోర్టు తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్జీవీ. తాను సినిమా తెరకెక్కిస్తున్న తీరును కోర్టు అర్థం చేసుకుందని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు రామ్‌గోపాల్‌వర్మ. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
VERY HAPPY to inform that our good intentions of making the film MURDER has been rightly understood by the honourable COURT ..Details will be given once the order is with us ..THANKING EVERYONE 🙏🙏🙏💐💐💐 pic.twitter.com/lmdD4mOWVd
— Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire