Game Changer: గేమ్ ఛేంజర్‎కు బిగ్ షాక్.. స్పెషల్ షో రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Game Changer: గేమ్ ఛేంజర్‎కు బిగ్ షాక్.. స్పెషల్ షో రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
x
Highlights

Game Changer: గేమ్ చేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో ఈ...

Game Changer: గేమ్ చేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. టికెట్ ధరల పెంపు విషయంలో ఈ సినిమాకు ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రతా దృష్ట సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం మొదట్లో అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. విడుదల రోజు సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా రూ.100 మల్టీప్లెక్స్ లో రూ. 150 పెంచుకునేందుకు జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వము వెనక్కు తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories