CM Revanth: అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్.. ఏమన్నారంటే..?
పుష్ప2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఓ వీడియో చేశారు.
CM Revanth About Allu Arjun: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై చిత్ర యూనిట్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గతంలో ఓ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు హీరోలు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ వీడియోలను రూపొందిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఓ వీడియోను రూపొందించారు.
పుష్ప2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఓ వీడియో చేశారు. డ్రగ్స్ నిర్మూలనపై, డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఓ షార్ట్ ఫిల్మిన్‌ను రూపొందించారు. అయితే తాజాగా ఈ వీడియోపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. 'డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం' అంటూ రాసుకొచ్చారు.
కాగా సీఎం రెవంత్ రెడ్డి చేసిన పోస్టులకు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. బన్నీ స్పందిస్తూ.. 'గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్ ను, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబరు 1908కు వెంటనే ఫోన్ చేయండి. వారు స్పందించింది బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం' అని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే పుష్ప2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Happy to see @alluarjun join and champion the public awareness campaign to save our children & youth of #Telangana from drugs.
— Revanth Reddy (@revanth_anumula) November 29, 2024
Let us all join hands for a healthy state and society.#DrugFreeTelangana #SayNoToDrugs https://t.co/W5RMYiNq07
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire