ఇక 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు కమలహాసన్.. ఆయన అసలు పార్థసారథి శ్రీనివాసన్.. సినిమాల్లోకి వచ్చాక అయన పేరును కమల్ హసన్ గా మార్చుకున్నారు..
ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హసన్ నేటితో 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అందులో భాగంగానే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కమల్ హసన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు..
"భారతదేశ గొప్పనటుల్లో కమలహాసన్ ఎప్పటికీ ఒకరుగా ఉంటారు. ప్రజాక్షేమం, సమాజశ్రేయస్సు పట్ల శ్రద్ధ, ప్రజల పట్ల ఆప్యాయత ఎంతో ప్రశంసనీయం. ఆయన ఈ పుట్టినరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు..
.@ikamalhaasan is one of the greatest actors India has ever produced. His warm, affectionate nature and concern for well-being of people and society are highly commendable. Wish him a very Happy Birthday & many more decades of good health! pic.twitter.com/hEhz6PWEfP
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 7, 2020
ఇక 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు కమలహాసన్.. ఆయన అసలు పార్థసారథి శ్రీనివాసన్.. సినిమాల్లోకి వచ్చాక అయన పేరును కమల్ హసన్ గా మార్చుకున్నారు.. 1959లో వచ్చిన 'కలతూర్ కన్నమ్మ'తో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చేసిన మొదటి సినిమాకే అయన నటనకి గాను ఏకంగా రాష్ట్రపతి గోల్డ్‌మెడల్ వచ్చింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ, తెలుగు భాషల్లో సినిమాలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు కమల్..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire