హెల్పింగ్ స్టార్ సోనూసూద్ కి ఆచార్య సెట్లో సత్కారం!

హెల్పింగ్ స్టార్ సోనూసూద్ కి ఆచార్య సెట్లో సత్కారం!
x
Highlights

సోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు..

సోనూసూద్ .. సహాయానికి నిలువెత్తు నిదర్శనం.. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్ లు మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి గాను ప్రధానితో పాటుగా చాలా మంది సోనూసూద్ ని ప్రశంసించారు. అటు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సోనూసూద్ ని ఆచార్య మూవీ సెట్లో సినీ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు కొరటాల శివ కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ స్పందించే గుణం మాత్రం కొందరి దగ్గర మాత్ర్రమే ఉంటుందని అన్నారు. అలా సహృదయంతో కొన్ని వందలమందికి సహాయం అందించిన మన బంగారం మన మధ్యనే ఉన్నాడని అన్నారు. అందుకే సోనూసూద్ ని సత్కరించించాలని అనిపించిందని అన్నారు. సత్కారం అనంతరం పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహాన్ని సోనూసూద్ కి అందజేశారు. సోనూసూద్ చేస్తున్న పంచముఖాలుగా ప్రపంచమంతా వ్యాపించాలని కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు.

అటు ఆచార్య విషయానికి వచ్చేసరికి ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories