పుట్టినరోజున తమన్నా పింక్ లుక్ అదిరింది!

పుట్టినరోజున తమన్నా పింక్ లుక్ అదిరింది!
x
Highlights

మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు లుక్ ఆకట్టుకునేలా నెట్టింట్లో హంగామా చేస్తోంది

తమన్నా భాటియా.. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకున్న అందాల రాశి. కెరీర్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తట్టుకుని నిలబడ్డ హీరోయిన్. ఈరోజు తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా తమన్నా గురించి కొన్ని విశేషాలు.

21 డిసెంబర్ 1986 లో తమన్నాముంబై లో పుట్టింది. ఈ మిల్కీ బ్యూటీ ముంబైలోనే తన కెరీర్ ప్రారంభించింది. కెరీర్ ఆరంభంలో ఫాంటా- చంద్రికా సబ్బులకు మోడల్ గా పని చేసింది. అటుపై తమన్నా 2005 లో హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చిత్రంలో నటించింది. తెలుగులో శ్రీ సినిమాతో ఆరంగేట్రం చేసింది. అయితే, ఆమెకు శేఖర్ కమ్ముల సినిమా హ్యాపీ డేస్ తెలుగులో మంచి గుర్తింపు ఇచ్చింది. అటు తరువాత ఆమె కెరీర్ తెలుగులో స్పీడ్ గా సాగిపోయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన తమన్నా తెలుగులో టాప్ హీరోయిన్ గా గుర్తింపు సాధించింది.

అటు బాలీవుడ్ లోనూ తమన్నా మంచి విజయాలు సాధించింది. బాలీవుడ్ లో హిమ్మత్ వాలా .. సాజిద్ ఖాన్ హమ్ షకల్స్ మరో చిత్రంలో కూడా నటించింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సరసన నటించింది. తమిళ చిత్రం `చారులత`లో నటనకు ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. దీనితో పాటు `నాచ్ బలియే 5` లో కూడా కనిపించింది. ఇందులో తన డ్యాన్స్ ప్రతిభను కూడా చూపించింది.

ఇక తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తన కొలీగ్స్ తో పార్టీలు పూర్తి చేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నపుడు తీసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఫొటోలో పింక్ డ్రస్ లో స్పెషల్ గా కనబడుతోంది తమన్నా. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించిన తమన్నా ప్రస్తుతం ఎఫ్ ౨ కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ త్రీ సినిమాలో నటిస్తోంది. Bhatia

Show Full Article
Print Article
Next Story
More Stories