Tamannaah: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.. త్వరలోనే హైదరాబాదీ కోడలు కానుందంటూ..

Tamannaah Bhatia Confirms Her Relationship With Vijay Varma
x

Tamannaah: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.. త్వరలోనే హైదరాబాదీ కోడలు కానుందంటూ..

Highlights

Tamannaah: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది..

Tamannaah: గత కొంతకాలంగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. విజయ్‌ వర్మ తనపై ఎంతో శ్రద్ధ చూపుతాడని.. అతడితో ఉంటే సంతోషంగా ఉంటానని తమన్నా చెప్పింది. 'సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్‌ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు.

నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం' అని చెప్పింది. 'లస్ట్‌ స్టోరీస్‌2' సెట్స్‌లోనే వాళ్లిద్దరి మధ్య బంధం మొదలైనట్లు తెలిపింది. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన 'లస్ట్‌ స్టోరీస్2' జూన్‌ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. నాని హీరోగా నటించిన "ఎంసీఏ" సినిమాలో కీలక పాత్రలో కనిపించారు విజయ్ వర్మ. నెటిజన్లంతా ఈ ప్రేమజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమన్నా త్వరలోనే హైదరాబాదీ కోడలు కానుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories