Taapsee: అందుకే పెళ్లి విషయం బయటకు చెప్పలేదు

Taapsee Pannu Breaks Silence On Her Wedding With Mathias Boe
x

Taapsee: అందుకే పెళ్లి విషయం బయటకు చెప్పలేదు

Highlights

Taapsee Pannu: సినీ నటి తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు.

Taapsee Pannu: సినీ నటి తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్ గా ఉంచింది. తాజాగా దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని తాము భావించలేదని అన్నారు. తన పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదని అన్నారు.

‘‘నా వివాహానికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి పెంచాలని అనుకోవడం లేదు. దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో నా భర్తకు మరో అభిప్రాయం ఉండొచ్చు. అందుకే మేము దీని గురించి మీడియా, సోషల్‌ మీడియాలో చెప్పలేదు. పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి దీనిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. వాళ్ల అంగీకారంతోనే చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆర్భాటాలకు చోటివ్వకుండా కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. భవిష్యత్తులో అందరికీ షేర్‌ చేయాలనుకుంటే అప్పుడు పోస్ట్‌ చేస్తాను’ అని చెప్పారు. మార్చి 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ-మథియాస్‌ బో వివాహం జరిగింది. ఇటీవల వీరి పెళ్లి వీడియో లీకవ్వగా అది వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories