Sushant Singh Rajput: పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ, మృత్యు కౌగిలి చేరాడు!

Sushant Singh Rajput: పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ, మృత్యు కౌగిలి చేరాడు!
x
Highlights

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సక్సెస్ పుల్...

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సక్సెస్ పుల్ హీరోగా కొనసాగుతూ, ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సుశాంత్ బలవన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌.. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీని గురించి త‌న తండ్రి కేకే సింగ్‌తోనూ అత‌ను మాట్లాడిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ ద్వారా వెల్ల‌డైంది.

సుశాంత్ తండ్రి కూడా ఆ పెళ్లికి అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు. కాగా ఆదివారం ఉద‌యం సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో సుశాంత్ కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు అత‌ని ప్రెండ్స్ తెలిపారు. సుశాంత్ పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న యువ‌తి వివ‌రాల‌ను పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories