SuperStar Krishna: సాహసాలను ఇంటిపేరుగా మార్చుకున్న కృష్ణ..

Superstar Krishna Is No More
x

SuperStar Krishna: సాహసాలను ఇంటిపేరుగా మార్చుకున్న కృష్ణ..

Highlights

SuperStar Krishna: జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి కొత్త తరహ ప్రయోగాలు

SuperStar Krishna: సాహసాలను ఇంటిపేరుగా మార్చుకుని, ఇండస్ట్రీని ప్రయోగశాలగా మార్చి నూతన శకానికి నాంది పలుకుతూ ఏ కంఠమైతే.. సంచలనాలకు మారుపేరుగా నిలిచిందో.. ఏ నవ్వు అయితే కొన్నేళ్ల పాటు తెలుగు తెరను ఏలిందో, ఎవరి కటౌట్ కనిపిస్తే ప్రేక్షకులు పరుగు పరుగున థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పరుగెత్తేవారో.. ఆ సూపర్ స్టార్ కృష్ణ కోట్లాది ప్రేక్షకులకు దూరంగా ఆకాశంలో ఒక తారగా వెలిగేందుకు వెళ్లిపోయారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ అందరి మనసుల్లో నటశేఖరుడు నిలిచాడు.

సినీ పరిశ్రమను కృష్ణ కొత్త దారుల్లో నడిపించారు. అప్పటివరకూ తెలుగు సినిమాలంటే సాంఘిక చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలే. ఇవి మాత్రమే సినిమాలు కావంటూ జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాండ్, కౌబాయ్ లాంటి కొత్త తరహా కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రయోగాలు చేసి తనను తాను హీరోగా నిలబెట్టుకున్నారు. కమర్షియల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదన్నా.. అల్లూరి సీతారామరాజు కథతోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ట్రెండ్ ఫాలో అయ్యేవారే ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కృష్ణ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

1970లో వచ్చిన అగ్నిపరీక్ష చిత్రంతో పద్మాలయ బ్యానర్‌‌ స్టార్ట్ చేసి కృష్ణ నిర్మాతగా మారారు. కానీ ఆ చిత్రం నిరాశ పరిచింది. రెండో సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కౌబాయ్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మోసగాళ్లకు మోసగాడు సినిమాను నిర్మించారు. 1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు హిందీ, తమిళ, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాషల్లోనూ డబ్ అయింది. నాలుగు రెట్లకు పైగా లాభాలతో పాటు, కృష్ణ ఆశించిన స్టార్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పండంటి కాపురంతో తన బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటిస్తూ నిర్మించిన దేవుడు చేసిన మనుషులు కూడా సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. దేవదాసు, కురుక్షేత్రం, ఈనాడు.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలను ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మించి నిర్మాతగానూ కృష్ణ ప్రూవ్ చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో సినిమాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్ వాలా, పాతాళ్ భైరవి, మవాలి వంటి బ్లాక్ బస్టర్స్ తీశారు.

హీరోగానే గాక మంచి మనసున్న వ్యక్తిగానూ సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోమని, ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేస్తానని మాటిచ్చేవారు. ఆ మాటను నిలబెట్టుకునేవారు కూడా. అంతేకాదు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచేవారు. అలా ఏనాడూ పారితోషికం విషయంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అందుకే కృష్ణను నిర్మాతల హీరో అని అంటుంటారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృష్ణను ఒక ట్రెండ్‌‌ సెట్టర్‌‌‌‌గా చెప్పొచ్చు. నటుడిగా కెరీర్‌‌‌‌ ప్రారంభించి, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలు తీశారు. స్టూడియోఅధినేతగానూ మెప్పించారు. కొత్త విషయాలను, టెక్నాలజీని టాలీవుడ్‌‌కు పరిచయం చేసిన క్రెడిట్ కృష్ణదే. కృష్ణ నటించిన తొలి చిత్రం తేనెమనసులు ఫస్ట్‌‌ ఈస్ట్‌‌మన్‌‌ కలర్‌‌ సోషల్‌‌ మూవీ. తెలుగులో ఫస్ట్ జేమ్స్ బాండ్‌‌ మూవీ గూఢచారి 116, తొలి ప్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు, తొలి సినిమా స్కోప్‌‌ టెక్నో విజన్‌‌ చిత్రం దొంగల దోపిడి, మొదటి కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు, తొలి 70ఎంఎం సినిమా సింహాసనం, తొలి డీటీయస్ సినిమా 'తెలుగు వీర లేవరా' చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories