Mahesh Babu : అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు.. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు, విలువలు నేర్పి
Mahesh Babu : అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు.. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు, విలువలు నేర్పి ఓ ఉత్తమమైన స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర వెలకట్టలేనిది.. అలాంటి గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటాం.. ఈ సందర్భంగా ఒకసారి తమ గురువులకు ధన్యవాదాలు చెప్పుకుంటాం..
అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. " అభ్యాసానికి హద్దులు లేవు! కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యార్థుల ప్రగతి కోసం అనేక మంది గురువులు తమ వంతు కృషి చేశారు. ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేరణ పొందడానికి, నేర్చుకోవడానికి నాకు సహాయం చేసిన నా మార్గదర్శకులకి ఎల్లప్పుడూ నా కృతజ్ఞతలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు" అని తెలిపారు మహేష్ బాబు..
Learning knows no bounds! Here's to all the teachers who are doing their best to ensure students receive all the support they need during the pandemic. Always grateful to all those who've inspired, helped me learn, and been my source of guidance. Happy Teacher's Day🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2020
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire