Sundeep Kishan: ఎట్టకేలకు సందీప్ కిష‌న్ త‌మిళ మూవీకి మోక్షం

Sundeep Kishan Tamil Movie Ready To Release On Sony Liv
x

నరకాసురుడు (ఫైల్ ఫోటో )

Highlights

Sundeep Kishan: ఎట్టకేలకు సందీప్ కిష‌న్,అరవింద్‌ స్వామి త‌మిళ మూవీకి మోక్షం

Sundeep Kishan: 'ధ్రువంగల్ పదినారు' కోలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 16 అనే పేరుతో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. యువ ధ‌ర్శ‌కుడు కార్తీక్ తెర‌కెక్కించిన ఈ థ్రిల్లింగ్ మూవీ తెలుగు, త‌మిళంలో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల మెప్పు పొందింది. ఈ సినిమా చూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్.. కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే మరో చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తాన‌ని ప్రక‌టించాడు. కానీ ఈ ప్రోత్సాహమే కార్తీక్‌కు శాపంగా మారింది. కార్తీక్ మూడో సినిమా 'మాఫియా' కూడా రిలీజ్ కాగా.. దీనికి మాత్రం మోక్షం కలగలేదు.

అందుకు కార‌ణం గౌతమ్ మీనన్‌కు ఉన్న ఆర్థిక వివాదాలు. మూడేళ్లకు పైగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. కార్తిక్ రెండో సినిమా పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఎట్టకేలకు 'నరకాసురన్'ను కూడా బయటికి తేవడానికి రంగం సిద్ధం చేసినట్లున్నాడు. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసినట్లు తెలుస్లోంది. కార్తీక్ తొలి చిత్రం 'ధ్రువంగల్ పదినారు'కు కొనసాగింపుగానే 'నరకాసురన్' తీశాడు కార్తీక్. 'సోనీ లైవ్' ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ చిత్రంలో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తోె పాటు శ్రియ, అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'నరకాసురుడు' పేరుతో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా సందీప్ కిషన్ నటించిన మరో తమిళ చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కసాడ తపర. ఇదొక ఆంథాలజీ ఫిలిం. సందీప్‌తో పాటు హరీష్ కళ్యాణ్, రెజీనా కసాండ్రా, దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్‌లోనే జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సందీప్ న‌టించిన రెండు తెమిళం చిత్రాలు రిలీజ్ కానుండ‌టంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. సోనీ లైవ్ కూడా తెలుగు సినిమాలు కొనుగోలు చేసిన రిలీజ్ చేయాల‌ని చూస్తుంది. ప్ర‌స్తుతం తెల‌గులోకి డ‌బ్బింగ్ సినిమాలు విడుదల చేసిన.. తెలుగులో కూడా మెల్ల‌గా మార్కెట్ పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories