Shobitha Shivanna: నటి శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ స్వాధీనం

Suicide Note Found in Kannada Actress Case
x

Shobitha Shivanna: నటి శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ స్వాధీనం

Highlights

Shobitha Shivanna: కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలకంగా మారింది.

Shobitha Shivanna: కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలకంగా మారింది. నిన్న రాత్రి గచ్చిబౌలి పీఎస్ లిమిట్స్‌లో ఆత్మహత్య చేసుకున్న శోభిత ఇంట్లో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అని రాసింది. అయితే ఎవరిని ఉద్దేశించి అలా రాసింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శోభిత మృతికి డిప్రెషన్ కారణమా లేకుండా... భార్యాభర్తల మధ్య ఏమైనా జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ రెడ్డితో శోభితకు పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తుక్కుగూడకు చెందిన సుధీర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న శోభిత నాటి నుంచి సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే భార్యాభర్తలిద్దరు గోవాకి వెకేషన్‌కి వెళ్లి వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories