Gorre Puranam: సుహాస్‌ హీరోగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

Gorre Puranam
x

Gorre Puranam: సుహాస్‌ హీరోగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

Highlights

Suhas: మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు.

Suhas: మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఫోకల్ వెంచర్స్ పతాకం పై సుహాస్ హీరో గా బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న కథ చిత్రం "గొర్రె పురాణం". ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదల అయిన టీజర్ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇది ఒక గొర్రె కథ, ఒక గ్రామంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఒక గొర్రె కథ. కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కథ కథనం తో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథ. సుహాస్ చాలా బాగా నటించాడు. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. 'భలే భలే', 'ఓ రారే రారే' లిరికల్ పాటలు విడుదలై గొర్రె పురాణం చిత్రం మీద అంచనాలు పెంచాయి. ఈ చిత్రం లో గొర్రె కి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories