Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'స్త్రీ-2'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

Stree 2 movie OTT streaming starts in amazon prime
x

Stree 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'స్త్రీ-2'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.. 

Highlights

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్త్రీ 2 స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఈ సినిమాను చూడొచ్చు.

స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన స్త్రీ-2 ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విషయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే థియేటర్లలో వండర్స్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్త్రీ 2 స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఈ సినిమాను చూడొచ్చు. అంటే అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నా స్త్రీ 2 మూవీ చూడాలంటే ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే స్త్రీ 2 మూవీకి అమర్‌ కౌశిక్‌ దర్థకత్వం వహించగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌ కుమార్‌ రావు కీలక పాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. కేవలం 39 రోజుల్లోనే ఈ సినిమా రూ.604.22 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.713 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

కథేంటంటే..

స్త్రీ 2 సినిమా కథ విషయానికొస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అంతలోనే అదే గ్రామంలో సర్కటతో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్ గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. అలాగే కొందరు అమ్మాయి కనిపించకుండా పోతారు. ఈ సమస్య పరిష్కారానికి శ్రద్ధాకపూర్‌తో పాటు కొందరు స్త్రీ అనే దయ్యం సాయం తీసుకుంటారు. అయితే ఊరు వదిలి వెళ్లిన దెయ్యం తిరిగి వచ్చిందా.? చివరికి ఏం జరిగింది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories