Rajamouli: ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను..ఆమెతో ఒక్కసారే మాట్లాడాను..తొలిప్రేమపై మనసు విప్పిన జక్కన్న

Rajamouli: ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను..ఆమెతో ఒక్కసారే మాట్లాడాను..తొలిప్రేమపై మనసు విప్పిన జక్కన్న
x
Highlights

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా రానా దగ్గుబాటి షోలో పాల్గొన్నారు. ఈ షోలో జక్కన్న పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు....

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా రానా దగ్గుబాటి షోలో పాల్గొన్నారు. ఈ షోలో జక్కన్న పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. డైరెక్టర్ రాజమౌళి కూడా కాలేజీ రోజుల్లో ఇష్టపడే అమ్మాయితో మాట్లాడేందుకు భయపడినట్లు చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి రానాతో చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు.

అమెజాన్ ప్రైమ్ కోసం రానా ఓ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ టాక్ షోలో రాజమౌళి ఒక ఎపిసోడ్ కు గెస్టుగా హాజరయ్యారు. ఆ సయమంల రాజమౌళి నుంచి రానా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు. ముఖ్యంగా ఇప్పటి వరకు రాజమౌళి చెప్పని విషయాలను రానా తన షో లో రాజమౌళిచె చెప్పించారు. అయితే తన కాలేజీ డేస్ లో జరిగిన ఓ స్టోరీ గురించి రాజమౌళి చెప్పుకొచ్చారు.

నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు. కానీ ఆ అమ్మాయితో ఎప్పుడూ మాట్లాడలేదు. మా క్లాస్ లో అబ్బాయిలు అందరికీ నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు తెలుసు. వారు నన్ను అమ్మాయి దగ్గరకు నెట్టుతూ మాట్లాడమనేవారు. ఆమెతో మాట్లాడలేవు అంటూ నన్ను ఏడిపించేవారు. ఏడాది మొత్తంలో ఒకసారి ఆమెతో మాట్లాడాను. అది కూడా చాలా కష్టం మీద మాట్లాడాను. ట్యూషన్ ఫీజు కట్టావా అంటూ మాట్లాడాను అని చెప్పారు రాజమౌళి.


ఏడాది పాటు ఆమెను ఇష్టపడ్డాను..ఆమెతో ఒక్కమాట మాట్లాడేందుకు కష్టపడ్డాను అంటూ ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజంగానే అప్పట్లో అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేందుకు చాలా భయపడేవారు. కొద్దిమంది స్వేచ్ఛగా మాట్లాడిన రాజమౌళి వంటి మొహమాటస్తులు మాత్రం సంవత్సరాల తరబడి అమ్మాయిల వెంట తిరిగినా కనీసం మాట్లాడేందుకు భయపడే పరిస్థితి ఉండేదంటూ రాజమౌళి వీడియోను షేర్ చేస్తూ చాలా మంది తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories