SS Thaman: తమన్‌పై ట్రోల్స్‌.. ఎమోషనల్‌ అయిన తమన్‌ భార్య శ్రీవర్ధిని..

SS Thaman Wife Sri Vardhini Respond on Social Media Trolls
x

SS Thaman: తమన్‌పై ట్రోల్స్‌.. ఎమోషనల్‌ అయిన తమన్‌ భార్య శ్రీవర్ధిని..

Highlights

SS Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మనందరికీ తెలిసిందే.

SS Thaman: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ను అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు తమన్. అయితే తమన్​ట్యూన్లు కాపీ చేస్తుంటాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా తన భర్త తమన్‌పై వస్తోన్న ట్రోల్స్‌ గురించి ఆయన సతీమణి, గాయని శ్రీవర్ధిని తొలిసారి స్పందించారు. విమర్శలను తాను పట్టించుకోనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమన్నారు.

తమన్‌ - నేనూ మణిశర్మ గారి వద్ద పనిచేశాం. మాది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయ్యాక సుమారు ఆరేళ్లు నాకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. అది నాకెంతో స్పెషల్‌ సాంగ్‌. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన 'కిక్‌'లో నేనొక పాట పాడా. అది నాకెప్పటికీ ప్రత్యేకమే. మావారు ట్రోల్స్‌ పట్టించుకోరు. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ నేనూ చదవను. నెగెటివ్‌ కామెంట్స్‌ చూసి బాధపడతామని తెలిసినప్పుడు.. వీడియోల కింద వచ్చే కామెంట్స్‌ చదవడం ఎందుకు? అని నేను అనుకుంటా. తమన్‌ను అభిమానించే వారందరికి థ్యాంక్స్‌' అంటూ ఎమోషనల్‌ అయింది శ్రీవర్ధిని.

Show Full Article
Print Article
Next Story
More Stories