Rajamouli Dance: దేవర పాటకు రాజమౌళి స్టెప్పులు.. వీడియో వైరల్

SS Rajamouli Dance For Devara Ayudha Pooja Song
x

Rajamouli Dance: దేవర పాటకు రాజమౌళి స్టెప్పులు.. వీడియో వైరల్

Highlights

Rajamouli Dance: రాజమౌళి తన డ్యాన్సుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Rajamouli Dance: రాజమౌళి తన డ్యాన్సుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర(Devara) మూవీలోని ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా(Sri Simha Wedding) పెళ్లి వేడుకలో రాజమౌళి డ్యాన్స్ చేశారు.

ఇక ఇదే పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. జక్కన్న డ్యాన్స్‌లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజమౌళి(Rajamouli)లో డైరెక్టరే కాదు మంచి డ్యాన్స్‌ర్ కూడా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే చిత్రం SSMB29 పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories