Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ
x

Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Highlights

Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Sridevi Soda Center Review: ఈ మధ్యనే "వి" సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు తాజాగా ఇప్పుడు "శ్రీదేవి సోడా సెంటర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి "పలాస 1978" ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. "జోంబీ రెడ్డి" సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన ఆనంది ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 27 2021 థియేటర్లలో విడుదలైంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమా కి మణిశర్మ సంగీతాన్ని అందించారు. యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించింది చూసేద్దమా.

చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్

నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, పవెల్ నవగీతన్, సత్యం రాజేష్, రఘు బాబు, అజయ్ తదితరులు

సంగీతం: మని శర్మ

సినిమాటోగ్రఫీ: శామ్ దత్

ఎడిటింగ్‌: ఏ శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

దర్శకత్వం: కరుణ కుమార్

బ్యానర్: 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్

విడుదల: 27/08/2021

కథ:

సినిమా కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఒక చిన్న పల్లెటూరు లో లైటింగ్ సూరి బాబు (సుధీర్ బాబు) లైట్ అరేంజ్మెంట్ లు చేస్తూ ఉంటాడు. అక్కడే ఒక షాప్ పెట్టుకుని సొంతంగా బిజినెస్ చేసుకోవాలని అతడి కల. ఒక రోజు వాళ్ల ఊరిలో శ్రీదేవి (ఆనంది)ని చూసిన సూరిబాబు వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. శ్రీదేవి వాళ్ళ నాన్న (నరేష్) ఒక సోడా సెంటర్ బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఆనంది కూడా సూరిబాబు ని ప్రేమిస్తుంది కానీ ఆమె తండ్రి మాత్రం వారి ప్రేమకి అడ్డుగా నిలుస్తారు. సూరిబాబు వేరే కులం వాడిని అతనిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని అడ్డు చెప్తారు. ఈలోపు సూరిబాబు ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. అదే ఊరిలో కాశీ (పావెల్ నవగీతన్) కూడా సూరిబాబు కి కొత్త కష్టాలు తెచ్చి పెడుతుంటాడు. చివరికి సూరిబాబు కథ ఏమైంది? ఆనంది తో తన ప్రేమ కథ సుఖాంతం అయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు

ఇప్పటిదాకా సాఫ్ట్ పాత్రలలో మాత్రమే కనిపించిన సుధీర్ బాబు ఈ సినిమాతో ఒక మాస్ లుక్ తో ప్రేక్షకులను అలరించాడు. క్లాస్ పాత్రలు మాత్రమే కాకుండా మాస్ పాత్రలతో సైతం తన నటనతో మెప్పించగలనని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు ఈ హీరో. తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయిన సుధీర్ బాబు నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఆనంది కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఆనంది మరియు సుధీర్ బాబు కెమిస్ట్రీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. పవేల్ నవగీతన్ కూడా నెగిటివ్ రోల్ లో చాలా బాగా నటించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ కూడా మంచి నటనను కనబరిచారు. సత్యం రాజేష్ రఘుబాబు కామెడీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది.

సాంకేతికవర్గం

ఇంటర్ క్యాస్ట్ ప్రేమకథ కాన్సెప్ట్తో ఇప్పటికే చాలా కథలు చూసాము కానీ ఈ సినిమాని మిగతా సినిమాల విభిన్నంగా తీయాలని దర్శకుడు బాగానే ప్రయత్నించారు. అయితే కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమాని ఆద్యంతం ఎంటర్టైనింగ్గా సాగేలా చూసుకున్నారు దర్శకుడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా లాంగ్ గా అనిపిస్తాయి. డైలాగులు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. విజయ్ చిల్లా మరియు శశి దేవి రెడ్డి అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

బలాలు:

నటీనటులు

ఎంటర్టైన్మెంట్

క్లైమాక్స్

బలహీనతలు:

స్క్రీన్ ప్లే స్లోగా ఉండటం

బలమైన కథ లేకపోవడం

రన్ టైం ఎక్కువగా ఉండడం

తీర్పు:

ఇంటర్ క్యాస్ట్ ప్రేమకథలు, పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వంటి కథలు ఇప్పటికే చాలా అనే చాలానే సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలోని క్లైమాక్స్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పల్లెటూర్లో ఉండే రాజకీయాలు, కుల విభేదాల గురించి సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొన్ని చోట్ల మాత్రమే పండింది అని చెప్పుకోవచ్చు. అయితే సెకండాఫ్ మాత్రం చాలా సీరియస్ గా నడుస్తుంది. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా కేవలం దర్శకుడు కేవలం కథ పైన మాత్రమే దృష్టి పెట్టడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సరికొత్త క్లైమాక్స్ సినిమాని హైలైట్ గా మారింది.

బాటమ్ లైన్:

కొత్త క్లైమాక్స్ తో ముగిసే రొటీన్ ప్రేమ కథ.

Show Full Article
Print Article
Next Story
More Stories