నీ మీదున్న ప్రేమను మాటల్లో చెప్పలేను.. చిరంజీవి కూతురు శ్రీజ ఎమోషనల్‌ పోస్ట్‌

Sreeja Konidela Emotional Birthday Wishes To Varun Tej
x

నీ మీదున్న ప్రేమను మాటల్లో చెప్పలేను.. చిరంజీవి కూతురు శ్రీజ ఎమోషనల్‌ పోస్ట్‌

Highlights

Sreeja Konidela: నేడు మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు.

Sreeja Konidela: నేడు మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మెగాఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, సాయితేజ్‌, నిహారిక సోషల్‌ మీడియా ద్వారా వరుణ్‌ తేజ్‌కి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. అందులో భాగంగానే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వరుణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

'పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు. అందుకే నీ కోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు. అంతేకాదు నాకు సపోర్ట్‌గా ఉన్నావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది'అంటూ వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories