SP Charan On SPB Health : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
SP Charan On SPB Health : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి..గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. దీనితో అందరూ కంగారుపడ్డారు.. అయన కోలుకోవాలని చాలా మంది ప్రార్ధనలు చేశారు.. అయితే బాలు తాజా ఆరోగ్య పరిస్థితుల పైన అయన తనయుడు ఎస్పీ చరణ్ అభిమానుల కోసం ఒక ఆడియో సందేశం పంపారు.
ఇందులో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాన్న గారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.. నిన్న వెంటిలేటర్ ఉంచడం ఆయనకి ఎంతో ఉపయోగపడిందని అన్నారు.. ఇక ప్రస్తుతం ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని, దీనిపై వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లుగా చరణ్ తెలిపారు.. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారని అన్నారు చరణ్... ఇక ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటానని చరణ్ వెల్లడించాడు.
ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఆగస్టు 5న కరోనా సోకింది.. దీనితో అయన చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన ఆరోగ్యం కాస్త మెరుగైనప్పటికీ గురువారం రాత్రి ఒక్కసారిగా క్షీణించినట్లుగా ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిన్న వెల్లడించాయి.. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్పీ చరణ్ వెల్లడించడంతో అభిమానులు ఉపిరి తీసుకుంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire