SP Charan on SP Balasubrahmanyam's health: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
SP Charan on SP Balasubrahmanyam's health: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 ఆసుపత్రిలో చేరిన ఆయన, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా చేసిన పరీక్షల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
ఉదయం నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయని ఆయన అన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వివరాలను ఎప్పకటికప్పుడు తనే అందిస్తానని.. అది నెగిటివా, పాజిటివా అనే విషయాన్ని పక్కన పెడితే ఏ విషయమైనా తన ద్వారానే తెలుస్తుందని ఓ వీడియో ఫేస్ బుక్‌లో విడుదల చేశారు. డాక్టర్ల ద్వారా తనకే ముందు విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌తోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చరణ్ తెలిపారు. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్‌డేట్ ఇస్తా. ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
Kindly Avoid Rumors About #SPB Sir Health @charanproducer #SPBalasubraniam pic.twitter.com/AVsSahYDhx
— Diamond Babu (@idiamondbabu) August 24, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire